రాజ్యాంగ పరిణామ క్రమం - 1

1. రెగ్యులేటింగ్‌ చట్టం, 1773 ద్వారా రద్దుచేసిన ఏ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861 ద్వారా పునరుద్ధరించారు?

Answer: బాంబే, మద్రాస్‌

 

2. ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861 ప్రకారం 1862లో మనదేశంలో మొదటి హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు?

Answer: కలకత్తా

 

3. ఏ చట్టం ద్వారా కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ పేరును ‘ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’గా మార్చారు?

Answer: ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1909

 

4. భారత్‌లో ‘ప్రత్యేక మత నియోజకవర్గాలను’ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?

Answer: ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1909

 

5. భారత్‌లో ‘మతనియోజకవర్గాల పితామహుడి’గా ఎవరిని పేర్కొంటారు?

Answer: లార్డ్‌ మింటో

 

6. 1911లో ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి  మార్చారు?

Answer:  లార్డ్‌ హార్డింజ్‌-II

 

7. 1924లో ఏర్పాటు చేసిన ఏ కమిటీ భారత్‌లో ద్వంద్వపాలనను సమర్థించింది?

Answer: అలెగ్జాండర్‌ మడ్డీమాన్‌ కమిటీ

 

8. 1927లో సైమన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిన అప్పటి బ్రిటన్‌ ప్రధాని ఎవరు?

Answer: బాల్డ్విన్‌

 

9. సైమన్‌ కమిషన్‌ భారత్‌లో మొదటిసారి ఎప్పుడు పర్యటించింది?

Answer: 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 మధ్య 

 

10. బ్రిటిష్‌ ఇండియా, భారత రాజ్యాల (సంస్థానాల) మధ్య సంతృప్తికరమైన ఆర్థిక సంబంధాలను సూచించడానికి 1927లో ఏర్పాటు చేసిన కమిటీ?

Answer: బట్లర్‌ కమిటీ