1. ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
Answer: 1937, ఏప్రిల్ 1
2. దిల్లీలో ఏర్పాటు చేసిన ‘ఫెడరల్ న్యాయ స్థానానికి’ మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు వ్యవహరించారు?
Answer: సర్ మారిస్ గ్వేయర్
3. ‘మంచి వాహనానికి చక్కటి బ్రేకులు అమర్చి, ముఖ్యమైన ఇంజిన్‌ను బిగించడం మరచిపోయారు’’ అని భారత ప్రభుత్వ చట్టం, 1935పై వ్యాఖ్యానించింది ఎవరు?
Answer: Nehru
4. ఏ చట్టం ద్వారా ‘కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్’ను ‘ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్’గా మార్చారు?
Answer: మింటో-మార్లే సంస్కరణల చట్టం, 1909
5. ‘‘మింటో-మార్లే సంస్కరణల చట్టం (1909) హిందువులు, ముస్లింల మధ్య వేర్పాటువాదానికి బీజాలు నాటి, భారతదేశ విభజనకు కారణమైంది’’ అని పేర్కొంది ఎవరు?
Answer: జవహర్‌లాల్ నెహ్రూ
6. 1921లో కేంద్ర శాసనసభలోని ‘లెజిస్లేటివ్ అసెంబ్లీ’కి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు?
Answer: సచ్చిదానంద సిన్హా, సర్ ఫ్రెడరిక్ వైట్
7. మాంటేగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం, 1919 ప్రకారం ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్’ ఏర్పాటు గురించి అధ్యయనం చేసేందుకు నియమించిన కమిషన్?
Answer: లీ కమిషన్
8. సాధారణ బడ్జెట్ నుంచి రైల్వేబడ్జెట్‌ను ఏ చట్టం ద్వారా వేరు చేశారు?
Answer: మాంటేగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం, 1919
9. ‘‘భారతదేశంలో ద్వంద్వ అనేది దాదాపు దూషించే మాట అయ్యింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నీవు డైయార్కివి అని అరవడం నేను విన్నాను’’ అని ఎవరు పేర్కొన్నారు?
Answer: సర్ బట్లర్
10. మాంటేగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం, 1919ని ‘‘సూర్యుడు లేని ఉదయం’’గా పేర్కొంది?
Answer: బాలగంగాధర్ తిలక్