1. ‘రాజ్యాంగం’ అనే భావనను తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించినవారు?
Answer: అరిస్టాటిల్
2. ‘స్వరాజ్’ అనేది బ్రిటిష్‌వారు ప్రసాదించే ఉచిత కానుక కాదని, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ అని 1922, జనవరి 5న గాంధీజీ ఏ పత్రికలో పేర్కొన్నారు?
Answer: యంగ్ ఇండియా
3. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు ‘రాజ్యాంగ సభ’ను ఏర్పాటు చేయాలని 1934లో ఆంగ్లేయులను తొలిసారిగా డిమాండ్ చేసిన భారతీయుడు?
Answer: మానవేంద్రనాథ్ రాయ్
4. జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని తొలిసారి అధికారికంగా ఆంగ్లేయులను డిమాండ్ చేసింది. అది ఎక్కడ జరిగింది?
Answer: ఫైజ్‌పుర్
5. భారతీయులతో కూడిన రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగ రచన జరిగితే మన దేశం ఎదుర్కొంటున్న కుల, మత వర్గాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని 1939లో ‘హరిజన్’ అనే పత్రికలో ఎవరు పేర్కొన్నారు?
Answer: మహాత్మా గాంధీ
6. 1921లో కేంద్ర శాసనసభలోని ‘లెజిస్లేటివ్ అసెంబ్లీ’కి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు?
Answer: సచ్చిదానంద సిన్హా, సర్ ఫ్రెడరిక్ వైట్
7. ‘భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను, ఇలాంటి దేశంలో అంటరానితనం, మత్తు పానీయాలు, మత్తు మందులు అనే శాపం ఉండరాదు’ అని 1931లో గాంధీజీ ఏ పత్రికలో వ్యాఖ్యానించారు?
Answer: యంగ్ ఇండియా
8. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు ‘రాజ్యాంగ సభ/రాజ్యాంగ పరిషత్’ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆంగ్లేయులు తొలిసారిగా దేని ద్వారా గుర్తించారు?
Answer: ఆగస్టు ప్రతిపాదనలు - 1940
9. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తామని ఆంగ్లేయులు తొలిసారి అధికారికంగా ఎప్పుడు ప్రతిపాదించారు?
Answer: క్రిప్స్ రాయబారం - 1942
10. మహాత్మా గాంధీ దేన్ని ‘పోస్ట్ డేటెడ్ చెక్’గా అభివర్ణించి తిరస్కరించారు?
Answer: క్రిప్స్ రాయబారం - 1942