1. త్వరలోనే రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికైన శాసన సభ్యులు రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకుంటారని 1945, సెప్టెంబరు 19న దిల్లీలోని ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రకటించినవారు?
Answer: లార్డ్ వేవెల్
2. బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ మంత్రిత్రయ రాయబారం/కేబినెట్ మిషన్‌ను భారతదేశానికి ఎప్పుడు పంపారు?
Answer: 1946, మార్చి 24
3. హైదరాబాద్ సంస్థానం నుంచి 15 మంది ప్రతినిధులను రాజ్యాంగ సభకు ఎప్పుడు నామినేట్ చేశారు?
Answer: 1948 నవంబరు
4. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డ్‌కు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరించారు?
Answer: దుర్గాబాయి దేశ్‌ముఖ్
5. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు ‘హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ గ్రంథాన్ని రాశారు?
Answer: భోగరాజు పట్టాభి సీతారామయ్య
6. 1947, ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారు?
Answer: కె.టి.షా, హెచ్.సి.ముఖర్జీ
7. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ ‘ముసాయిదా రాజ్యాంగాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టింది?
Answer: 1948, నవంబరు 4
8. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను ఆధునిక మనువుగా, రాజ్యాంగ పితామహుడిగా ‘ది కాన్‌స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?
Answer: ఎం.వి.పైలీ
9. రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?
Answer: 1946 డిసెంబరు 9 నుంచి 23 వరకు
10. జవహర్‌లాల్ నెహ్రూ ‘ఉద్దేశాల తీర్మానం/చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?
Answer: 1946, డిసెంబరు 13