1. ఉద్దేశాల తీర్మానాన్ని ‘మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ’ అని ఎవరు అభివర్ణించారు?
Answer: జవహర్‌లాల్ నెహ్రూ
2. ‘డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగం 1935, భారత ప్రభుత్వ చట్టానికి జిరాక్స్ కాపీలా ఉంది’ అని ఎవరు విమర్శించారు?
Answer: మౌలానా హస్రత్ మొహాని
3. మన దేశంలో 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నారు?
Answer: నవంబరు 26
4. 1949, నవంబరు 26న ఆమోదించిన రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి రావడానికి ప్రధాన కారణం?
Answer: లాహోర్‌లో ఆమోదించిన సంపూర్ణ స్వరాజ్ తీర్మానం
5. రాజ్యాంగ సభ చివరి సమావేశం (12వ) ఎప్పుడు జరిగింది?
Answer: 1950, జనవరి 24
6. రాజ్యాంగ సభ చివరి సమావేశంలో ఎంత మంది ప్రతినిధులు హాజరై రాజ్యాంగ రాతప్రతులపై సంతకాలు చేశారు?
Answer: 284
7. ‘భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగా వ్యవహరిస్తుంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?
Answer: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
8. రాజ్యాంగంలోని ప్రతిపేజీని శాంతినికేతన్‌లోని చిత్రకారుల సహకారంతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాత్మకంగా రూపొందించినవారు?
Answer: నందలాల్ బోస్
9. రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ సర్వసమ్మతి, సమన్వయ పద్ధతులను ఉపయోగించిందని ‘ది ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?
Answer: శిఖర్ మిశ్రా
10. రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ ‘సర్దుబాటు పద్ధతిని’ (Method of Adoption) ఉపయోగించిందని ‘ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?
Answer: అవస్తీ, మహేశ్వరి